Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మందులపై ఆంక్షలతో మరింత తీవ్రం
టెహ్రాన్: ఇరాన్లో పిల్లలకు వింత జబ్బు వచ్చింది. శరీరంపై రసికారే పుండ్లు ఏర్పడి మంటలు పుట్టుతున్నాయి. ఈ వ్యాధిని ఎపిఢ్రమాసిసిస్స్ బులోసా అని అంటారు. దీనికి స్వీడన్ కంపెనీ మేపిల్కెన్ అనే మందు సరఫరా చేసేంది. అమెరికా ఇరాన్‌పై ఆంక్షలు విధించడంతో స్వీడన్ కంపెనీ సరఫరా నిలిపివేసింది. అత్యవసర మందులకు ఆంక్షలు ఉండవని చెప్పుతునే లోపాయకారిగా ఆంక్షలు పని చేస్తున్నాయి. దానితో పిల్లలు, ప్రధానంగా మృత్యువాత పడుతున్నారు.ఈ జబ్బు ఉన్న వారికి శరీరంపై రసితో నిండిన పుండ్లు అయి రసీ కారుతుంటుంది. దానికి కట్టే బ్యాండేజీ రసిని పిల్చుకుని పేషంట్‌కు కొంత ఊరట కలుగుతున్నది. ఇలాంటి అత్యవసర మందులపై ఆంక్షలు విధించి పసి పిల్లలను చంపడం అమెరికా దురుద్దేశంను పౌర సమాజం తీవ్రంగా ఖండిస్తున్నది.