Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్ వ్యాఖ్య
కొపెన్హేగన్ : మొత్తంగా 70శాతం ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునే వరకు కరోనా మహమ్మారి భయం తొలగిపోదని డబ్ల్యుహెచ్ఓ యురోపియన్ డైరెక్టర్ హాన్స్ క్లాగ్ హెచ్చరించారు. యూరప్‌లో వ్యాక్సిన్ వేసే క్రమం చాలా మందకొడిగా సాగుతోందని ఆందోళన వెలిబుచ్చారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్లు రాన్రాను పెరిగిపోతుండడం ప్రధాన ఆందోళనగా మారిందని అన్నారు. బ్రిటీష్ వేరియంట్ బి.117 కన్నా ఇండియన్ వేరియంట్ బి.1617 చాలా ఎక్కువగా ఇతరులకు వ్యాపిస్తోందని అన్నారు. గతంలోని స్ట్రెయిన్ల కన్నా బ్రిటీష్ వేరియంట్ చాలా త్వరగా సంక్రమించిందన్నారు.
మహమ్మారిలో వేగం అనేదే చాలా కీలకమని బెల్జియం డాక్టర్ వ్యాఖ్యానించారు. డబ్ల్యుహెచ్ఓ కూడా కరోనాను మహమ్మారిగా ప్రకటించినా ఇంకా చాలా దేశాలు వేచి చూస్తున్నాయి. దీనివల్ల మనం చాలా విలువైన సమయాన్ని కోల్పోతున్నామని క్లాగ్ అన్నారు. వ్యాక్సిన్లు వేగంగా అందరికీ వేయడమే ప్రస్తుతం అధిక ప్రాధాన్యత గల అంశమని అన్నారు. డబ్ల్యుహెచ్ఓ యురోపియన్ రీజియన్‌లో మొత్తంగా 53దేశాలు, ప్రాంతాలు వున్నాయి. వీటిలో చాలా సెంట్రల్ ఆసియాలో కూడా వున్నాయి. ఇక్కడ 26శాతం మందికి తొలి వ్యాక్సిన్ డోసు అందింది. యురోపియన్ యూనియన్‌లో 36.3శాతం మందికి మొదటి డోసు అందింది.