Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డమస్కస్: సిరియాలో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో ప్రస్తుత అధ్యక్షుడు తిరిగి ఎన్నికైనారు. ఎన్నికలలో పడ్ట ఓట్లలో ఆయనకే 95.1 శాతం ఓట్లు వచ్చాయని పార్లమెంటు స్పీకర్ హమూద్ సబ్బాగ్ ప్రకటించారు. పోటీలో నిలబడిన మరో ఇద్దరు అభ్యర్థులలో అబద్దల్లా సలోమ్ అబ్దుల్లాకు 1.5 శాతం ఓట్లు, మహమూద్‌కు 3.3 శాతం ఓట్లు వచ్చాయి. సిరియా 2011 నుంచి యుద్ధంలోనే ఉన్నది. అమెరికా సామ్రాజ్య వాదులు అక్కడ నిరంతరం వైమానిక దాడులు చేస్తూ దేశాన్ని విధ్వంసం చేశారు. ఇప్పటికే అక్కడ జరిగిన ప్రాణ నష్టం 3,80,000 మందికి చేరింది. ఈ యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోనే ఎన్నికలు జరిగాయి. 1.42 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 76.64 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే ఎన్నికలు అప్రజాస్వామికంగా, ఏ మాత్రం స్వేచ్ఛ లేకుండా జరిగినట్టు అమెరికా, యూరోపియన్ దేశాలు ప్రచారం చేస్తున్నాయి. అధ్యక్షుడు అస్సాద్ ఈ తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు