Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీలంక రాజధాని కొలంబోలో అతి పెద్ద ఓడ రేవు నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది పూర్తిగా శ్రీలంక ప్రభుత్వం ఆధీనంలోనే నిర్మించబడుతుందని అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. దాని కోసం 'ది కొలంబో పోర్ట్ ఎకనామిక్ కమిషన్ చట్టం'' రూపొందిస్తున్నారు. కొలంబో సముద్ర తీర ప్రాంతం కావడంతో భౌగోళిపరంగా, వ్యూహాత్మకంగా కీలకమై నది. భారతదేశంతో సహా ఈ పోర్టు నిర్మాణమైతే ఈ ప్రాంతం భద్రతకు సంబ ంధించిన సమస్యలు తలెత్తుతాయా అని పరిశీలిస్తున్నాయి. విదేశీ పెట్టుబ డితో ఈ పోర్టు నిర్మాణం కానున్న నేపథ్యంలో ఏ దేశం ఎఫ్డీఐ వస్తుందనేది కీలక అంశంగా మారింది. ఆ విషయాన్ని శ్రీలంక ప్రభుత్వం గోప్యంగా ఉంచు తున్నది. కొలొంబో పోర్టు సిటీ దయ్యంమా దేవదూతనా' అనే అంశంపై జరిగిన సదస్సులో ఓ సీనియర్ మంత్రి మాట్లాడుతూ శ్రీలంక అలీన విధానం పాటిస్తుంది. అన్ని దేశాలు మాకు సమానమే అని ప్రకటి ంచారు. కొలంబో పోర్ట్ సిటీ స్వేచ్చా వాణిజ్య మండలిలో ఉండటాన్ని అక్కడి ట్రేడ్ యూనియన్స్ పౌర సమాజం, బుద్దిస్టు పెద్దలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం శ్రీలంక ప్రభుత్వం కొలంబియాలోని హార్బర్ దగ్గర ఆకాశ వంతెన నిర్మించడానికి చైనా ప్రభుత్వ నిర్మాణ సంస్థకు కేటాయించారు.