Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్రమత్తమైన అధికారులు.. లాక్డౌన్ అమలు
బీజీంగ్ : ప్రమాదకర కరోనా మహమ్మారిని పూర్తిగా కట్టడి చేసి ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచింది చైనా. అనేక ఆంక్షలను విధిస్తూ ప్రమాదర మహమ్మారి నుంచి ఆ దేశం బయటపడింది. అయితే, దక్షిణ చైనాలోని గాంగ్జౌవ్ నగరంలో గత ఏడురోజులగా 20 కొత్త కేసులు బయటపడ్డాయి. ఈ సంఖ్య భారత్‌తో పాటు ఇతర దేశాల్లో నమోదవుతున్న కరోనా కేసులతో పోల్చుకుంటే చాలా తక్కువే. అయినప్పటికీ చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. నగరంలో లాక్‌డౌన్‌ను ప్రకటించింది. పౌరులెవరూ బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నగరంలో దాదాపు 1.5 కోట్ల జనాభా ఉంటుంది. వ్యాపారాలు, పరిశ్రమలకు ఈ నగరం కేంద్రం. కాగా, లివాన్ జిల్లాలోని స్థానికులకు పరీక్షల కోసం స్థానిక యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ మార్కెట్లు, చైల్డ్‌కేర్ సెంటర్లు, ఎంటర్టైన్మెంట్ కేంద్రాలు మూతపడ్డాయి. అలాగే, ఇండోర్ రెస్టారెంట్లు, గ్రేడ్ స్కూళ్ల మూసివేతకు ఆదేశాలిచ్చారు. బహిరంగ కార్యక్రమాలను పరిమితం చేయాలని లివాన్‌కు చుట్టుపక్కల నాలుగు జిల్లాల అధికారులకు ఆదేశాలు వెలువడ్డాయి.