Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒట్టావా: కెనడాలోని ఒక స్కూలు ఆవరణలో 215 మంది పిల్లల శవాలు పాతి పెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శవాలలో 3 సంవత్సరాల చిన్న పిల్లలు కూడా ఉండటం కనపడింది. కెనడాలో కామ్లూప్లోని స్థానిక జాతుల పిల్లల కోసం పెట్టిన గురుకుల పాఠశాల ఇది. ఒకప్పుడు ఇది అతి పెద్ద స్కూలు. ఈ స్కూలుకు స్థానిక జాతుల పిల్లలను తీసుకువచ్చి వారికి విద్యా బుద్దులు నేర్పి కెనడా సమాజంలో ఇముడ్చుకోవాలనే లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది. భూమిలో చేధించి చూడగల ర్యాడార్తో జరిపిన అన్వేషనలో ఈ విషయం బయటపడింది. ఆ స్కూలు పేరు కామ్లూప్స్ ఇండియన్ రెసిడెన్షిల్ స్కూలు. అతి పురాతనమైన స్కూలు ఇది. 1970 వరకు ఆ స్కూలులో 1,50,000 మంది పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాలని ఈ పథకం ఉద్దేశం.ఈ స్కూలు ప్రభుత్వ నిధులతో నడిచే క్రిష్టియన్ స్కూలు. విద్యా బుద్దులు నేర్పి ఆ పిల్లలను క్రిష్టియన్ మతంలోకి మార్పిడి చేసేవారు. ఆ స్కూలు పెట్టిన హింసకు దాదాపు ఆరు వేల మంది విద్యార్థులు చనిపోయినట్లు తెలుస్తున్నది. 2008లో కెనడా ప్రభుత్వం ఆ స్కూలులో జరిగిన నేరాలకు పార్లమెంట్లో క్షమాపణ చెప్పింది. శారీరక, లైంగిక హింస ఆ స్కూలులో విచ్చల విడిగా ఉండేదని ప్రభుత్వం అంగీకరించింది.