Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బొగోటా: కొలంబియాలో నెల రోజుల నుంచి సరళీకరణ విధానాల వలన ఏర్పడిన సమస్యలతో సతమతమౌతున్న ప్రజలు నిరసనలకు పూనుకున్నారు. దేశాధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ ఆందోళనకారులతో చర్చలు జరిపి ఒప్పందంపై సంతకం పెట్టకుండా తప్పుకున్నాడు. దానితో నిరస నలు మరింత ఉదృతం అయినాయి. కొలంబియా మొబైల్ పోలీసు విభా గం ఇస్నుర్ నిరసన కారులపై విరుచుకుబడి చాలా మందిని గాయ పరి చింది. పెద్ద ఎత్తున బాష్పవాయువు ప్రయోగించింది.దాంతో ఆ గ్యాస్ ఇండ్లల్లో నిండిపోయి సాధారణ పౌరులు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. దానితో స్థానికలు ప్రభుత్వాన్ని వెంటనే ఇస్మర్ను ఉపసం హరించాలని కోరుకున్నారు. మ్యాండ్రిడ్ మున్సిపల్ మేయర్ ఉపసం హరించడానికి అంగీకరించి ఆదేశాలు జారీ చేశారు. నిరసన కారులు మాత్రం ఒప్పందంపై అధ్యక్షుడు సంతకం పెట్టే వరకు నిరసనలు కొనసాగుతాయని మరింత తీవ్రతరం చేస్తామని ప్రకటించారు.