Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రసిలియా: బోల్స్ నారోను పదవి నుంచి తొలగించాలని 57 శాతం మంది తమ అభిప్రాయాన్ని ఒక సర్వేలో చెప్పారు. బ్రెజిల్‌లోని 27 రాష్ట్రాలలోని 462 మున్సిపల్ పట్టణాలలో ఈ అభిప్రాయ సేకరణ నిర్వహించారు. బోల్స్‌నారో కోవిడ్ మహమ్మారిని అరికట్టడంలో చూపిన నిర్లక్ష్యానికి ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరుకుంటున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆయన నిర్లక్ష్యం వహించడంపై సెనేట్‌లో విచారణ జరుగుతున్నది. గతంలో కూడా సర్వే నిర్వహించారు. అప్పటి కంటే ఇప్పుడు ప్రజలు మరింత స్పష్టంగా ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరుకుంటున్నారు.