Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇజ్రాయిల్ ప్రభుత్వానికి నాలుగు బిలియన్ల డాలర్లు సైన్యం కోసం ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నది. దాని వినియోగించి నేతన్యాహు నాయకత్వంలోని ఇజ్రాయిల్ ప్రభుత్వం పాలస్తీనా ప్రజలపై తీవ్రంగా దాడులు చేస్తూ వారిని నిర్వాసితులను చేస్తున్నది. పాలస్తీనీయులను వాళ్ళ ఇళ్ళ నుంచి వెళ్ళ కొట్టే హీనమైన చర్యలకు పాల్పడుతున్నది. అందుకని అమెరికాలోని వామపక్ష సెనేటర్ బెర్నీసాండర్స్ ఈ ఆర్థిక సహకారాన్ని ఇవ్వడాన్ని సమీక్షించాలని కోరుతున్నారు. ఇజ్రాయిల్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుంటే సైనిక ఆర్థిక సహకారం ఇవ్వడం సరికాదని ఇది అమెరికాలోని చట్టాలకు కూడా విరుద్దం అని పేర్కొన్నారు. ఇజ్రాయిల్ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి వెంటనే కాల్పుల విరమణకు అంగీకరించేలా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సహకారం ఒబామా కాలంలో ప్రారంభం అయింది. దాన్ని బైడెన్ కొనసాగించడం సరికాదని సాండర్స్ కోరారు. అమెరికా పౌరులు కట్టే పన్నుల నుంచి మానవ హక్కులపై దాడి చేస్తున్న ఇజ్రాయిల్‌కు సైనిక ఆర్థిక సహకారం చేయడం పెద్ద తప్పిదం అని పేర్కొన్నారు.