Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియాలో జల సంరక్షణ కార్యకర్తల హర్షం
కాన్బెర్రా : ఆస్ట్రేలియా ప్రజా పోరాటానికి విజయం లభించింది. 2019 ఏప్రిల్‌లో ఆదానీ నార్త్ గెలిలీ వాటర్ స్కీమ్ (ఎన్జీడబ్ల్యూఎస్)ను సమీక్షించి, ఆమోదించే సమయంలో 'వాటర్ ట్రిగ్గర్' పరీక్షను వర్తింపచేయడంలో ప్రభుత్వం విఫలమైందని మే 25న ఫెడరల్ కోర్టు తీర్పు చెప్పింది. సెంట్రల్ క్వీన్స్‌లాండ్‌లో ఆదానీ కార్మిచెల్ బొగ్గు గని కోసం సటర్ నది నుంచి ఏడాదికి 1,250 కోట్ల లీటర్ల నీటిని తీసుకోవడానికి వేసిన పైప్‌లైన్ పథకమే ఎన్జీడబ్ల్యూఎస్. నదీ వనరులపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయా లేదా అని తెలుసుకోవడానికి ముందుగా బొగ్గు గనుల నుంచి వచ్చే వాయువు, బొగ్గు గనుల తవ్వకాల కార్యకలాపాలపై ఫెడరల్ ప్రభుత్వం సమీక్షించి, ఆమోదం తెలియచేయాల్సి వుంది. 2013లో ఆమోదించిన పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ చట్టం (ఈబీబీసీ యాక్ట్) ఈ వాటర్ ట్రిగ్గర్ పరీక్ష గురించి ప్రస్తావిస్తోంది. ఉపరితల జలాలు, భూగర్భ జలాలపై బొగ్గు గనుల ప్రాజెక్టుల ప్రభావం ఎలా వుంటుందో తెలుసుకోవడానికి ఈ వాటర్ ట్రిగ్గర్ పరీక్ష ఉద్దేశించబడింది. అయితే బొగ్గును వెలికితీయడానికి సంబంధించే ఈ పరీక్ష వర్తిస్తుంది కానీ పైప్లైన్లకు వర్తించబోదని ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయాన్ని ఆస్ట్రేలియా కన్జర్వేషనల్ ఫౌండేషన్ (ఏసీఎఫ్) సవాలు చేసింది. గతేడాది మార్చిలో అదానీకి వ్యతిరకంగా కోర్టుకెళ్ళింది. అదానీ కంపెనీ ప్రణాళికలను సరిగా సమీక్షించలేదని విమర్శించింది.