Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెతన్యాహూకు గడ్డుకాలం
జెరుసలేం: ఇజ్రాయిల్ ఆపదర్మ ప్రధానమంత్రి నెతన్యాహూ నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తున్నది. నాలుగు సార్లు జరిగిన ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. దానితో నేతన్యాహు ఆపదర్మ ప్రధానిగా కొనసాగుతున్నాడు. యామినా పార్టీకి చెందిన బెన్నెట్ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నెతన్యాహూ ఈ ప్రయత్నాలను చులకనగా మాట్లాడుతున్నారు. యామినీ పార్టీకి చెందిన బెనిట్ట్, ప్రతిపక్ష పార్టీ నాయకుడు యార్ లాపిన్ ఇతరులను కలుపుకుని జాతీయ ఐక్యతా ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలలో నాలుగు సార్లు ఎన్నికలు జరిగినా ఏ పార్టీ లేక కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయలేక పోయినాయి. దానితో ఇజ్రాయిల్లో అనిచ్చిత పరిస్థితులు ఏర్పడి అవకతవకలు జరుగుతున్నాయి. ఆపదర్మ ముఖ్యమంత్రిపై అవినీతి ఆరోపణలు, కరానో మహమ్మారిని అరికట్టడంలో విఫలం కావడం, పాలస్తీనాపై అనవసర యుద్ధానికి పోవడం లాంటి ఆరోపణలు ఉన్నాయి.