Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆకలితో ఆరేండ్ల చిన్నారి మృతి
- సిరియా శరణార్థి శిబిరంలో విషాదం
డమాస్కస్: గొలుసుల్లో బందీగా కనిపిస్తున్న ఈ చిన్నారి వయసు ఆరేండ్లు. పేరు నహ్లా అల్ ఒత్మాన్..ఈ పాపకు చాలా రోజుల నుంచి సరైన ఆహారం అందటంలేదు. దాతలిచ్చిన ఆహారం తినేటపుడు ఆ పాప ఉక్కిరిబిక్కిరైంది. అంతలోనే శ్వాస ఆగిపోవటంతో.. కన్నుమూసింది. పసివయసులోనే ఆకలిపోరాటం చేసింది. నహ్లా ఎన్నో కష్టాలు ఎదురైనా ఆ వయసులో భరించింది. సిరియాలో యుద్ధం కారణంగా సిరియన్లతో సహాయ శిబిరాలకు తరలివస్తున్నారు. తన తండ్రితో రెఫ్యూజీ క్యాంప్‌నకు వచ్చిన నహ్లా తన తండ్రితో ఉంటున్నది.శిబిరాల్లో ఉంటున్న వారు తమ బిడ్డలను కాపాడుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయి. అతి జాగ్రత్తల వల్ల పసివాళ్ల ప్రాణాల మీదకు తెస్తున్నది. నహ్లా విషయంలోనే అదే జరిగింది.పగటి పూట నహ్లాను గొలుసులతో కట్టిఉంచుతున్నారు. ఎక్కడ తప్పిపోతుందోనన్న అనుమానంతో చైనుతో కుటుంబసభ్యులే కట్టిఉంచుతున్నారు. చేతులకు వేసిన చైన్లతోనే బయట తిరిగేది. రాత్రి అయితే నహ్లా కష్టాలు అన్ని ఇన్నీకావు. ''పిల్లల్ని గొలుసులతో బందీంచవద్దని ఆ బిడ్డల తండ్రులను కోరుతున్నా.. నిరాకరిస్తున్నారని క్యాంప్ సూపర్వైజర్ హిషామ్ అలీ తెలిపారు. నహ్లా ఆహారం తినేటపుడు ఊపిరి ఆడక చనిపోయిందన్న విషయాన్ని మీడియాలో వచ్చాక..తండ్రిని అరెస్టు చేశారు. వాయువ్య సిరియా తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్నది. ఇక్కడి ఫర్జల్లా శిబిరంలో నహ్లా తన కుటుంబంతో ఉంటున్నది.. బాంబు దాడులకు భయపడి ఈ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అయితే ప్రాణరక్షణ కోసం తరలివచ్చినా..చిన్నారులకు ఆహారం అందటంలేదు. పోషకాహార లోపం కూడా పెరుగుతున్నది. నహ్లా కూడా అలాంటి ఇబ్బందులబారినపడి కన్నుమూసింది.సిరియా శరణార్థుల్లో నివసిస్తున్న చిన్నారుల బతుకులు అర్థంతరంగా ముగుస్తున్నాయి.