Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికా యూరప్‌లోని తన మిత్రదేశాలైన జర్మనీ, నార్వే, ఫ్రాన్స్, స్వీడన్ దేశాల అగ్ర నాయకులపై నిఘా పెట్టి వారి ఫోన్ కాల్, మెయిల్ చాట్స్‌ను డెన్మార్క్‌కు చెందిన డానిష్ రేడియో సంస్థ ద్వారా సేకరించడాన్ని తీవ్రంగా పరిగణించాయి. డానిష్ రేడియో సముద్ర మార్గంగా ఉన్న తన కాబెల్సు తోడు ఈ అమెరికా గూడచారి సంస్థల కేబుల్స్‌ను జారవిడిచి కీలక సమాచారాలను సేకరించింది. ఈ వ్యవహారం 2012 నుంచి 2014 వరకు సాగినట్టు ఈ మధ్యన బయపడింది. ఈ వ్యవహారాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజిలా మెర్కల్ తీవ్రంగా పరిగణించి అమెరికా వివరణ ఇవ్వాలని కోరుతున్నారు. ఇందులో పాత్రదారులైన అమెరికా , డెన్మార్క్ సంస్థ సమాధానం ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు. మిత్ర దేశాలపై నిఘా వేయడం హేయమైనా చర్య అని వారు మండి పడుతున్నారు. అమెరికా, యూరోపియన్ దేశాల మధ్య ఉన్న సానుకూల స్నేహ సంబంధాలలో అనుమానంకు తావులేదు. అటు వంటి సందర్భంలో గూడచర్యం చేయడం సరి కాదని ఫ్రాన్స్ అధ్యక్షుడు చెప్పారు.