Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీ అగ్నికీలల్లో ధ్వంసమైన రసాయనాల ఓడ
-శ్రీ సముద్రంలో మునక
కొలంబో : సముద్ర తీరంలో పెద్ద పర్యావరణ విపత్తును ఎదుర్కొంటున్నట్లు శ్రీలంక అధికారులు గురువారం తెలిపారు. రసాయనాలు తీసుకెళుతున్న కంటెయినర్ నౌక అగ్నిప్రమాదంలో ధ్వంసమై ప్రధాన ఓడరేవులో మునిగిపోతోందని చెప్పారు. సింగపూర్‌కి వెళుతున్న ఎం.వి.ప్రెస్ పెరల్లో ప్రమాదం సంభవించి గత 12 రోజులుగా అగ్నికీలల్లో ధ్వంసమైందని, బుధవారం నుండి మునగడం ప్రారంభమైందని చెప్పారు. కొలంబో ఓడరేవుకు దూరంగా లోతైన జలాల్లోకి నౌకను తీసుకువెళ్ళేందుకు ప్రయత్నాలు ఫలించలేదు. ఓడ పైనున్న భాగం మునిగిపోయి, సముద్ర గర్భంలో 21 మీటర్ల (70అడుగులు) లోతుకి వెళ్ళిందని అధికారులు చెప్పారు. అగ్నిప్రమాదంతో నౌకలోని సరుకు చాలావరకు ధ్వంసమైందని నిర్వాహకులు తెలిపారు. ఆ సరుకులో 25 టన్నుల నైట్రిక్ యాసిడ్, ఇతర రసాయనాలు వున్నాయి.
అయితే, ఓడ మునిగిపోతే అందులో ఇంకా మిగిలివున్న రసాయనాలు, ఓడ ఇంధన ట్యాంకుల్లో గల వందలాది టన్నుల చమురు సముద్ర జలాల్లోకి లీకవుతుందని అన్నారు. దీనివల్ల సముద్రంలోని జలచరాలకు నష్టం వాటిల్లుతుందని, దేశంలోని ప్రముఖ బీచ్‌ల్లో కాలుష్యం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వందలాది టన్నుల ప్లాస్లిక్ వ్యర్ధాలు తీరానికి కొట్టుకొస్తున్నాయి. ఇప్పటికే తీరప్రాంతం పొడవునా 80 కిలోమీటర్ల మేరా చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. ఓడ పరిస్థితిని, చమురు కాలుష్యాన్ని పర్యవేక్షించేందుకు నిపుణులు రంగంలోకి దిగారని కంపెనీ తెలిపింది.