Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కానీ, ఆశలు లేవు : క్రెమ్లిన్
మాస్కో : చిరకాల స్వప్నమైన రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు బైడెన్ మధ్య సమావేశం 'చాలా చాలా కీలకమైనదే' అయినా, ఎలాంటి ఆశలు లేవని క్రిమ్లిన్ (రష్యా అధ్యక్ష భవనం) స్పష్టం చేసింది. ఈ నెల 16న స్విట్లర్లాండ్‌లోని జెనీవాలో పుతిన్, బైడెన్ మధ్య ముఖాముఖి సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం వద్ద క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ శుక్రవారం మాట్లాడుతూ ఈ భేటీతో రెండు దేశాలు తిరిగి సెట్ అవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయని, ఉపసంహరణకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. సమావేశం చాలా చాలా ముఖ్యమైనదే అయినా, ఈ సమావేశంపై ఎక్కువ ఆశలు పెట్టుకోవడం చాలా పొరపాటని చెప్పారు. ఈ సమావేశంలో ఇరుదేశాలు పరస్పర అంగీకారానికి వచ్చే అంశాలు చాలా తక్కువగా ఉంటాయని, విభేదించే అంశాలే ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఈ సమావేశంలో మానవ హక్కుల నుంచి సైబర్‌టాక్‌ల వరకు 'పూర్తి స్థాయి'లో చర్చిస్తారని వైట్ హౌస్ ప్రతినిధి జెన్ సాకి తెలిపారు. ఉక్రెయిన్ యొక్క 'సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత' సమావేశం ఎజెండాలో ఉంటుందని చెప్పారు.