Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికా తన సైన్యాన్ని అప్ఘనిస్థాన్ నుంచి సెప్టెంబర్లో పూర్తిగా ఉపసంహరించుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో శాంతిని కాపాడుకునేందుకు చైనా, పాకిస్థాన్ అప్ఘనిస్థాన్ సమన్వయంతో పని చేయాలని చైనా విదేశాంగ మంత్రి ఇటీవలనే ఇతర రెండు దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఒక సారి అమెరికా ఉపసంహరణ జరిగితే తాలిబన్లు విజృంబించి హింస పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికే అక్కడక్కడ హింస జరుగుతున్నది. చైనా సరిహద్దు రాష్ట్రాలలో హింస పెరిగే అవకాశం కూడా ఉన్నది. అందుకని చైనా ముందు చూపుతో వ్యవహరిస్తున్నది.