Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బైడెన్ 59 చైనా కంపెనీలను బ్లాక్ లిస్ట్ చేశారు. ఈ కంపెనీలకు చైనా మిలటరీకి కావాల్సిన ఆయుధాలు తయారు చేస్తున్న పరిశ్రమలతో వ్యాపార లావాదేవీలు ఉండటం వలననే బ్లాక్ లిస్ట్ చేశారు. గతంలో 31 చైనా కంపెనీలు ఈ లిస్ట్‌లో ఉండేవి. వాటిని సమీక్ష చేసి కొన్నింటిని తొలగించి కొత్త వాటిని ఇప్పుడు చేర్చడం జరిగింది. ఇందులో టెలికం కంపెనీలు అయిన చైనా మొబైల్, చైనా టెలికామ్ వీడియో నిఘా సంస్థ అయిన హిక్ విజన్, చైనా రైలవే నిర్మాణ సంస్థ, చైనా ఆయిల్ కార్పోరేషన్ లాంటి పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఈ నిబంధనలు ఆగస్టు 2 నుంచి అమలులోకి వస్తాయి. ఇప్పటికే పై సంస్థలలో పెట్టుబడులు పెట్టి ఉంటే ఒక సంవత్సరం కాలంలో వాటిని ఉపసంహరించికునేందుకు గడువు ప్రకటించారు.