Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాలు రెండేళ్ల పాటు సస్పెండ్ అవుతాయని ఫేస్బుక్ శుక్రవారం ప్రకటించింది. జనవరి 6న కేపిటల్‌పై దాడికి ముందుగా హింసను ప్రేరేపిం చారని వెల్లడైన నేపథ్యంలో 2023 వరకు సోషల్ నెట్‌వర్క్‌లో ఆయన ఉనికిని స్తంభింపజేయాలని నిర్ణయించింది. సస్సెన్షన్ ముగిసిన తర్వాత ప్రజాభద్రతకు ట్రంప్ ముప్పు తగ్గిందా లేదా అన్నది కంపెనీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని ఫేస్బుక్ ఉపాధ్యక్షుడు నిక్ క్లెగ్ తెలిపారు. హింసాత్మక ఘటనలు, శాంతియుతంగా గుమిగూడడంపై ఆంక్షలు, ఇతర పౌర అశాంతి సూచనలు వంటి కారణాలన్నింటినీ ఫేస్బుక్ పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. విద్వేష ప్రసంగాలు, అనవసర దూషణలు వంటి వాటి నుండి రాజకీయ నేతలను ఆటోమేటిక్‌గా మినహాయించ డమనే వివాదాస్పద విధానానికి కూడా స్వస్తి పలకనున్నట్లు ఫేస్బుక్ తెలిపింది. పౌర అశాంతి, హింస పెచ్చరిల్లే సమయంలో ప్రజా ప్రముఖులకు పెనాల్టీలను మరింత కఠినతరం చేయనున్నట్లు తెలిపింది. ఫేస్బుక్ నిర్ణయాన్ని అవమానంగా ట్రంప్ అభివర్ణించారు. ట్రంప్‌ను నిరవధికంగా సస్సెండ్ చేస్తామన్న రూలింగ్ స్థానంలో ఈ రెండేళ్ల నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ రకమైన సెన్సారింగ్‌ను వారు అమలు చేసేందుకు అనుమతించరాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతిమంగా తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.