Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వందమందికి పైగా అమాయకుల ఊచకోత
వాగడూగు : బుర్కినాఫాసోలో శుక్రవారం రాత్రి జరిగిన భయంకరమైన దాడిలో వందమందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారని భద్రతా వర్గాలు శనివారం తెలిపాయి. 2015 నుంచి జిహాదీ హింస కొనసాగుతున్నప్పటికీ, ఇంత భారీగా రక్తపాతం చోటు చేసుకోవడం ఇదే మొదటి సారి అని ఆ వర్గాలు చెప్పాయి. ఉత్తరప్రాంత పట్టణమైన సోల్హాన్లోకి చొరబడిన సాయుధులైన వ్యక్తులు రాత్రంతా ప్రజలను ఊచకోత కోశారు. మరణించిన వారిలో అన్ని వయసుల వారు, మహిళలు వున్నారని భద్రతా దళ అధికారులు తెలిపారు. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో గ్రామంలోకి చొరబడిన సాయుధులు ఇళ్లపై పడి చాలామందిని ఉరి తీశారని స్థానికులు చెబుతున్నారు. జిహాదిస్టులపై పోరాడేందుకు సైన్యానికి మద్దతుగా 2019 డిసెంబరులో వలంటీర్స్ ఫర్ ది డిఫెన్స్ ఆఫ్ ది మదర్లాండ్ (విడిపి) ఏర్పడింది. ముందుగా వారిపై విరుచుకుపడిన జిహాదీలు తర్వాత ఇళ్లపైబడ్డారు. తీవ్రంగా ప్రాణ నష్టంతో పాటు, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఇళ్లు, మార్కెట్‌ను తగలబెట్టారని భద్రతా వర్గాలు తెలిపాయి.