Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా తాజా జాబితాపై చైనా
బీజింగ్ : హ్యూవే, స్మిక్తో సహా మొత్తం 59 కంపెనీలను బ్లాక్‌లిస్టులో పెడుతూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ గురువారం ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు జారీ చేయడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ప్రతీకార చర్యలు తప్పవని అమెరికాను హెచ్చరించింది. తమ ఆయుధ, పారిశ్రామిక సముదాయానికి చెందిన టెక్నాలజీ సంస్థలను అమెరికా అణచివేస్తోందని చైనా విమర్శించింది. ఆసియన్ సూపర్ పవర్ చైనా 2028 నాటికి అమెరికాను పక్కకు నెట్టి ప్రపంచ నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగనున్నదని పలు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్న తరుణంలో అమెరికా చైనాపై సాంకేతిక ఆంక్షలను తీవ్రతరం చేస్తోంది. సోవియట్ యూనియన్ పతనం తరువాత మరో సూపర్ పవర్‌గా ఎవరినీ అనుమతించేది లేదని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. చైనాను బలహీనపరిచేందుకు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన విధానాన్నే బైడెన్ కూడా కొనసాగిస్తున్నారు. గత నవంబరులో ట్రంప్ 31 చైనా కంపెనీలపై ఆంక్షలు విధించగా, బైడెన్ ఆ సంఖ్యను ఈ ఏడాది ప్రారంభంలో మరింత పెంచారు. ఈ కంపెనీలన్నీ చైనా మిలటరీ, భద్రతా యంత్రాంగానికి అవసరమైన సరఫరాలు అందించడమో లేదా మద్దతివ్వడమో చేస్తున్నాయి.