Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) శతవార్షికోత్సవానికి సన్నాహాలు చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) ఏర్పడి జులై1 నాటికి వందేళ్లు పూర్తి కానుంది. ఈ శతాబ్ద కాలంలో పలు సవాళ్లను, సరీక్షలను అధిగమించి చైనా ప్రజలను ముందుకు నడిపించడంలో సిపిసి నిర్వహించిన అమోఘమైన పాత్రకు సంబంధించిన విశేషాలను చైనా గ్లోబల్ టైమ్స్ పత్రిక నెల రోజుల ముందు నుంచే వరుస కథనాలను ఇవ్వనారంభించింది. ఈ సిరీస్ను అది రెండు విభాగాలుగా విడగొట్టింది.
తుపాను తరువాత తుపాను, సంక్షోభం తరువాత సంక్షోభం ముంచుకొచ్చినా నాయకత్వం దృఢంగా వ్యవహరించి వాటన్నిటినీ దీటుగా ఎదుర్కొని నిలబడింది. ఇదే సిపిసి విజయగాథలో కీలకమైన అంశం. ఇదంతా మొదటి భాగంలో వస్తుంది. రెండో భాగంలో 1980వ దశకం చివరిలో చీకటి కాలం నుంచి సిపిసి బయటపడి ఎలా ఎదిగినదీ, సోవియట్ యూనియన్ పతనం, తూర్పు యూరపు దేశాల్లో పెను మార్పుల తరువాత మారిన ప్రపంచ పరిస్థితులు, పాశ్చాత్య భావజాలం దేశీయంగా చూపిన ప్రభావం వీటి మధ్య చైనా తనదైన పంథాను రూపొందించుకుని అభివృద్ధిలో నవ శకానికి విశ్వాసంతో ఎలా ప్రస్థానం సాగిస్తున్నదీ వివరించే ప్రయత్నం చేస్తుంది.