Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ప్రపంచ జనాభాలో పది శాతం వాటా ఉన్న అల్పాదాయ దేశాలకు 0.5 శాతం వ్యాక్సిన్ డోసులే అందాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్‌కు సీనియర్ సలహాదారైన బ్రూస్ ఐల్వార్డ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు వేసిన 200 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల్లో 60 శాతం డోసులు అమెరికా, చైనా, భారత్ లోనే వేశారని చెప్పారు. ఈ మూడు దేశాల్లోనూ దేశీయంగా తయారైన వ్యాక్సిన్లే వినియోగించారని అన్నారు. అల్పాదాయ దేశాలకు 0.5 శాతమే దక్కడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. 200 కోట్ల వ్యాక్సి న్లలో 15 శాతం డోసులను ఏడు దేశాల్లో వేశారనీ, 75 శాతం డోసులను పది దేశాల్లో వేశారని ఆయన వివరించారు. 127 దేశాలకు కరోనా వ్యాక్సిన్ డోసులను సరఫరా చేయడంలో, ఆ దేశాలు వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించడంలో కొవాక్స్ (గ్లోబల్ వ్యాక్సిన్ అలయెన్స్ నేతత్వంలో ప్రపంచవ్యాప్తంగా దేశాలకు కోవిడ్ టీకాలను అందించేందుకు ఏర్పడిన కూటమి) కీలక పాత్ర పోషించిందని ఆయన తెలిపారు. భారత్‌లో కరోనా రెండోదశ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కొవాక్స్ ద్వారా టీకాల పంపి ణీకి అంతరాయం ఏర్పడిందని చెప్పారు. ఐరాస శాంతి పరిరక్షక దళం సభ్యుల కోసం భారత్ అందజేసిన రెండు లక్షల కరోనా వ్యాక్సిన్ డోసుల ను వినియోగిస్తున్నామని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటో నియో గుటెరస్ ప్రతినిధి స్టీఫెన్ డుజార్రిక్ తెలిపారు. ''భారత ప్రభుత్వం రెండు లక్షల టీకా డోసులు అందజేసింది. అ మేరకు శాంతి పరిరక్షక దళం సభ్యులు టీకాలు పొందుతున్నారు'' అని ఆయన వివరించారు.