Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : కోవిడ్-19కి చెందిన అధిక వ్యాప్తి ప్రభావం కలిగిన డెల్టా వేరియంట్ బ్రిటన్‌లో వేగంగా వ్యాపిస్తోంది. ఆ దేశంలో ఇంకా కోట్లాది మంది వ్యాక్సినేషన్ పూర్తికాని నేపథ్యంలో భయాందోళనలు రేపుతోంది. గత వారంలో ప్రయోగశాల ధ్రువీకరించిన డెల్టా కరోనా వైరస్ కేసుల సంఖ్య 79 శాతం పెరిగి 12,431కు చేరుకుందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ గురువారం పేర్కొంది. ఈ డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య కెంట్ లేదా ఆల్ఫా వేరియంట్ కేసుల సంఖ్యను అధిమించిందని తెలిపింది. డెల్లా వేరియంట్‌కు చెందిన నేపాలీస్ స్ట్రెయిన్ కూడా బ్రిటన్‌లో కొత్త మ్యుటేషన్‌గా ప్రవేశించిందని ప్రభుత్వం అంగీకరించింది. భారత్‌లో వెలుగుచూసిన బి.1.617 విభాగంలోని మూడు వేరియంట్లలో డెల్టా(బి.1.617.2) కూడా ఒకటి. భారత్‌ను ఈ వేరియంట్ వణికిసో ్తందని, రెండో దశలో వైరస్ తీవ్ర ప్రభావానికి ఈ వేరియంటే కారణమని ప్రభుత్వ అధ్యయనం తేల్చిన విషయం తెలిసిందే. డెల్టా వేరియంట్‌ను బ్రిటన్‌లో మొదటిసారిగా ఈ ఏడాది ఏప్రిల్ 1న గుర్తించారు. ఆర్థిక వ్యవస్థను మరింత విస్తృతంగా తెరిచేందుకు ఎటువంటి అడ్డంకులు ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ వేరియంట్ దేశంలో ఉందని ప్రభుత్వం ఏప్రిల్ 15వ తేదీ వరకు ప్రకటించలేదు. ఈ విధంగా నిర్లక్ష్యపూరితంగా అన్ని కార్యకలాపాలను పున:ప్రారంభించడంతో కొద్ది కేసులుగా ఉన్న డెల్టా ఇన్ఫెక్షన్లు స్థిరంగా పెరగడంతోపాటు అధిక మరణాలు కూడా సంభవించే పరిస్థితులు నెలకొన్నాయి. గత వారం రోజులుగా బ్రిటన్‌లో రోజుకు సరాసరిన మూడు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం నాడు గత కొన్ని రోజుల్లో రికార్డు స్థాయిల్లో 6,238 కేసులు వెలుగుచూశాయి.