Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: కరోలినా రాష్ట్రంలో తన పార్టీ సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. అందులో ఆయన అమెరికా వైద్య ఆరోగ్య నిపుణుడు ఫుజీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక డాక్టరే కాదని, కేవలం ప్రచారకుడు అన్నారు. రెండోది చైనా వల్లనే కరోనా వ్యాపించినందుకు చైనా 10 ట్రిలియన్ డాలర్స్ అమెరికాతో సహా ప్రపంచ దేశాలకు నష్ట పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. తాను 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పాల్గొనాలని చూస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశంకు అధ్యక్షత వహించిన రిపబ్లికన్ పార్టీ కరోలినా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ట్రంప్‌ను అమెరికా అధ్యక్షుడు అని పరిచయం చేశారు. సమావేశంలో ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు తనే గెలిచానని, అధ్యక్ష పద విని తన నుంచి దొంగిలించారనే పాత మాటనే మళ్ళీ చెప్పుకువచ్చారు.