Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో సోమవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 50మంది మరణించారు. దాదాపు 70మంది గాయపడ్డారు. ఎగువ సింథ్ ప్రాంతంలోని ఘోట్కి జిల్లాలోని దహర్కికి సమీపంలో రెండు రైళ్ళు ఢకొీన్నాయని అధికారులు తెలిపారు. తెల్లవారు జామున దాదాపు 3.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన సంభవించిందని పాకిస్తాన్ రైల్వేస్ ప్రతినిధి తెలిపారు. కరాచి నుండి సర్గోదకు వెళుతున్న మిల్లట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి అ పక్కనే గల డౌన్ ట్రాక్‌పై బోగీలు పడ్డాయి. ఈలోగా రావల్పిండి నుండి కరాచి వెళుతున్న సర్సయ్యద్ ఎక్స్‌ప్రెస్ వచ్చి ఆ బోగీలను ఢ కొందని ఆయన తెలిపారు. చాలా దగ్గరకు వచ్చిన తర్వాత పట్టాలపై బోగీలు పడి వుండడం కనిపించడంతో డ్రైవర్ అత్యవసర బ్రేకులు వేయడానికి ప్రయత్నించారు కానీ ఫలితం లేకపోయిందని రైల్వేస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రమాదంలో మిల్లట్ ఎక్స్‌ప్రెస్‌కి చెందిన ఆరు బోగాలు పట్టాలు తప్పగా, ఐదు బోగీలు తిరగబడ్డాయి. సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ రైలుకి చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పగా మరో మూడు తిరగబడ్డాయి. పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు, జిల్లా అధికారులు, సహాయక సిబ్బందితో పాటు సైన్యాన్ని కూడా రంగంలోకి దింపారు. బోగీల్లో చిక్కుకుపోయిన వారిని బయటకు తీయడం చాలా కష్టసాధ్యమవుతోందని సహాయక సిబ్బంది తెలిపారు. నుజ్జు నుజ్జయిన బోగీల నుండి వెలికితీయడం పెద్ద సవాలుగా మారిందన్నారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే మంత్రి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఈ ప్రమాదం పట్ల ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతుందని పాకిస్తాన్ రైల్వే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిసార్ మెమన్ తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రు.15లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియాను అధికారులు ప్రకటించారు. గాయపడినవారికి వారి గాయాల తీవ్రతను బట్టి లక్ష నుండి మూడు లక్షల వరకు ప్రకటించారు.