Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్ : సాధారణ పౌరుడు ఆ దేశ అధ్యక్షుడి చెంప చెళ్లుమనిపించిన ఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యువెల్ మాక్రాన్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. డ్రోమ్ రీజియన్‌లోని టెయిన్-ఐ హెర్మిటేజ్ గ్రామంలో జరిగిందీ ఘటన. మంగళవారం ఆగేయ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన అధ్యక్షుడు మధ్యాహ్న సమయంలో ఒక హైస్కూలును సందర్శించారు. అనంతరం కారు వైపు వెళ్తుండగా, బయట ఉన్న ప్రేక్షకులు తమ వద్దకు రావాలని నినాదాలు చేయడంతో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తుండగా ఒక వ్యక్తి ఆయన చెంప చెళ్లుమనిపించాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మాక్రాన్‌ను వెనక్కి లాగి ఆ వ్యక్తితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.