Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆమోదం తెలిపిన చైనా
బీజింగ్ : మూడేండ్లు దాటిన పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చేందుకు చైనా ఆమోదం తెలిపింది. మూడు నుండి 17ఏండ్ల వయస్సు వారికి వ్యాక్సిన్లను ఇచ్చేందుకు అనుమతి ఇవ్వడం ద్వారా ఇంత పిన్న వయస్కులకు వ్యాక్సిన్లను ఆమోదించిన తొలి దేశంగా నిలిచింది. భద్రతా ఆందోళనలు, ఉత్పత్తి సామర్ధ్యం ప్రాతిపదికగా దశలవారీగా ఈ ప్రణాళికను అమలు చేయనున్నట్టు చైనా పరిశీలకులు తెలిపారు. 3-17 సంవత్సరాల గ్రూపు వారికి కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన విషయాన్ని వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధి మండలికి చెందిన అధికారి ఆదివారం చైనా సెంట్రల్ టెలివిజన్ (సీసీటివి)కి తెలియచేశారు. అయితే ఆయన పేరును టీవీ వెల్లడించలేదు. ఆ వయస్సు వారికి వ్యాక్సిన్ ఇవ్వడం సురక్షితమేని నిపుణులు ధృవీకరించారని తెలిపారు. సంబంధిత అనుమతులు, ఆమోద ముద్రలు పొందిన తర్వాత వారికి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామన్నారు. జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్‌హెచ్‌సి) డిప్యూటీ డైరెక్టర్ జెంగ్ యిగ్జిన్ మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ ఏడాది చివరి నాటికి 70శాతం జనాభాకు వ్యాక్సిన్లు ఇవ్వాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాలంటూ మూడేండ్లపై వయస్సు వున్నవారికి టీకా వేయడం చాలా కీలకమని చైనా వ్యాక్సిన్ నిపుణులు సోమవారం గ్లోబల్ టైమ్స్‌తో వ్యాఖ్యానించారు. అయితే ఇందులో ఇమిడివున్న భద్రతాపరమైన ఆందోళనలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని అత్యంత జాగ్రత్తగా చేపట్టనున్నట్లు తెలిపారు. వయస్సు వారీగా వివిధ గ్రూపులుగా వర్గీకరించడం, పైగా కరోనా వైరస్ పెచ్చరిల్లే ప్రమాదమున్న ప్రాంతాల్లోని మైనర్లకు ముందుగా వేయడం వంటి చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు.