Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒలింపిక్స్ నిర్వాహకుల వెల్లడి
టోక్యో : ఒలింపిక్స్ క్రీడా వార్తలను కవరేజ్ చేయడానికి విదేశాల నుండి వచ్చే మీడియా సిబ్బందిని జిపిఎస్ ద్వారా ట్రాక్ చేస్తూ వారిపై నిఘా వుంచుతామని టోక్యో నిర్వాహక కమిటీ సిఇఓ తొషిరో ముటో తెలిపారు. ఈ నెల చివరిలో విడుదల చేయనున్న నిబంధనలన్నింటినీ వారు పాటిస్తున్నారా లేదా అనేది పర్యవేక్షిస్తూ వుంటామని చెప్పారు. వారు జపాన్లోకి ప్రవేశించిన తర్వాత పలుసార్లు, స్వదేశానికి వెళ్ళడానికి ముందుగా రెండుసార్లు మీడియాకు పరీక్షలు చేయిస్తామని చెప్పారు. దేశంలోకి వచ్చిన తర్వాత మొదటి 14రోజులు క్వారంటైన్లో వుండాలని, నిబంధనలు పాటిస్తామని వారు ప్రతిన చేయాలని కోరారు. ఒకవేళ ఎవరైనా ఉల్లంఘించినట్లు తేలితే, వారి అక్రిడేషన్లను సస్పెండ్ చేయడమో లేదా రద్దు చేయడమో, పంపివేయడమో వంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు. విలేకర్ల ఫోన్లను కూడా జిపిఎస్ ద్వారా ట్రాక్ చేస్తామన్నారు. అయితే మీడియా కాకుండా దేశంలోకి ప్రవేశించే వేలా దిమందికి కూడా ఇవే నిబంధనలను కఠినంగా అమలు చేస్తారా లేదా అన్నది ఆయన వివరణ ఇవ్వలేదు. ఐఓసి అధికారులు, జాతీయ ఒలిం పిక్ కమిటీల అధికారులు, క్రీడా సంఘాల వారు, బ్రాడ్కాస్టర్లు, కాంట్రా క్టర్లు వీరందరి విషయంలో ఎలా వ్యవహరిస్తారో వెల్లడించలేదు. స్థానిక నిర్వాహకులు అందించిన గణాంకాల ప్రకారం, 11,090మంది టోక్యోకు రావడానికి సిద్ధంగా వున్నారు. వీరికి అదనంగా మరో 59వేల మంది ఒలింపిక్స్‌కు హాజరవుతారు. అంటే మొత్తంగా 70వేల మంది వస్తారని భావిస్తున్నారు.