Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెక్ బిల్లుపై చైనా విమర్శ
బీజింగ్ : అమెరికా గతం చుట్టూ తిరుగుతూ , ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వం నుంచి అది బయటపడలేకపోతున్నదని చైనా విమర్శించింది. సాంకేతిక రంగంలో చైనాను దెబ్బతీయడానికి ఉద్దేశించిన బిల్లును అమెరికా సెనెట్ మంగళవారం నాడు ఆమోదించింది. అమెరికా చేసిన ఈ కొత్త చట్టాన్ని బుధవారం చైనా విదేశాంగ వ్యవహారాల కమిటీ తీవ్రంగా విమర్శించింది. సాంకేతికత, ఆర్థిక అంశాల్లో అభివృద్ధి చెందేందుకు తమ దేశానికి గల చట్టబద్ధమైన హక్కును అమెరికా దెబ్బ తీయాలని చూస్తోందని ఈ కమిటీ విమర్శించింది. ఆ చట్టం పూర్తి స్థాయి ప్రచ్ఛన్న యుద్ధం నాటి మనస్తత్వం, సైద్ధాంతికమైన విభేదాలతో కూడి ఉందని పేర్కొంది. యుఎస్ ఇన్నోవేషన్ అండ్ కాంపిటిషన్ యాక్ట్‌గా పిలిచే ఈ కొత్త చట్టాన్ని మంగళవారం అమెరికా సెనెట్ ఆమోదించింది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక బిల్లుల్లో ఒకటిగా ఇది నిలిచింది. ఈ బిల్లుకు విస్తృతంగా మద్దతు లభించింది. 68మంది మద్దతు ఇవ్వగా, 31మంది వ్యతిరేకించారు. సెనెట్‌లో బిల్లు ఆమోదించిన ఈ బిల్లును ప్రతినిధుల సభకు పంపనున్నారు. అమెరికా సాంకేతికత, పరిశోధనా రంగాలను బలోపేతం చేసేందుకు 19వేల కోట్ల డాలర్లను ఖర్చు చేసేందుకు ఈ బిల్లు రూపొందించారు.