Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 170 బిలియన్ డాలర్లు కేటాయింపు
వాషింగ్టన్: చైనా నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకొని అమెరికా సెనేట్ కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టింది. దానికి అమెరికా ఆధునీకరణ, పోటీ చట్టం అని పేరు పెట్టింది. దీనిలో భాగంగా నూతన ఆవిష్కరణలు చేయడానికి, సెమీకండెక్టర్ల రంగంలో ఆధిపత్యం సాధించడానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించారు. ఈ బిల్లును డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఇద్దరూ బలపరిచారు. అమెరికా చరిత్రలో ఇది చాలా కాలం తరువాత జరిగిన పరిణామం.
బైడెన్ ఈ బిల్లుపై మాట్లాడుతూ 21వ శతాబ్ధంను అమెరికా గెలవడానికి పేల్చిన మొదటి తుపాకి తూటా అని చెప్పారు. అమెరికా ఆధునిక దేశంగా, ఉత్పత్తిలో మొదటి స్థానం సాధించాలని బైడెన్ ఆకాంక్షించారు. కృత్రిమ మేధ, స్వదేశంలో సెమీకండెక్టర్ల తయారీ, క్వాంటమ్ సైన్స్‌ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ప్రకటించారు. ఇంతకు ముందు మరో బిల్లు పాస్ చేశారు. అందుకని ఇప్పటి బిల్లును పాత బిల్లును అనుసంధానం చేయాలని ఆదేశించారు. ఇది చైనాను అడ్డుకోవడానికి అత్యవసరమని సెనేట్ భావించింది.