Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాంగాన్: మయన్మార్లో ఆకలి చావుల ముప్పు పొంచి ఉన్నదని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం హెచ్చరించింది దేశంలోని తూర్పు భాగంలో సైనిక పాలకులకు స్థానిక తిరుగుబాటు దారులకు మధ్య జరుగుతున్న దాడులతో ధన, ప్రాణ నష్టం పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఇప్పటికే 800 మంది చనిపోయినట్టు, దాదాపు ఒక లక్ష మంది నిరాశ్రయులు అయినట్టు తెలుస్తున్నది. ఫిబవరి నెల నుంచి దేశంలో సంక్షోభం నెలకొనటంతో.. ఆర్థిక వ్యవస్థ స్తంభించి పోయింది. ఈ అంతర్గత హింస ఆగకపోతే చాలా మంది ఆకలి చావులకు గురయ్యే అవకాశం ఉన్నదని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. సైనిక పాలకులు మాత్రం ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని జనం ఆరోపిస్తున్నారు.