Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మొదటి సారి సమావేశం అవుతున్నారు. ఈ సందర్భంలో సరికొత్త అట్లాంటిక్ ఒప్పందంపై సంతకాలు చేయడానికి సన్నాహాలు ఇప్పటికే ప్రారంభించారు. బైడెన్ జీ-7 దేశాల సమావేశం కోసం బ్రిటన్లో ఉన్నారు. ఈ సందర్భంలో 1941లో బ్రిటన్ ప్రధాని చర్చిల్కి అమెరికా అధ్యక్షుడు రూస్వెల్ట్ మధ్య జరిగిన అట్లాంటిక్ ఒప్పంద పత్రాలను ఉభయులు పరిశీలించారు. ఆ ఒప్పందంలో రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పరిస్థితుల్లో ప్రపంచానికి కొత్త దిశా నిర్దేశం చేయడానికి కొన్ని లక్ష్యాలు రూపొందించారు. స్వేచ్ఛా వాణిజ్యం, ఆయుధాల తగ్గింపు, స్వయం నిర్ణయాధికారం అందులో ఉన్నాయి. అమెరికా, బ్రిటన్ మధ్య ప్రత్యేకమైన సంబంధాలు ఏర్పడాలని కూడా భావించారు. ఆనాటి ఒప్పందం లాంటి ఒక కొత్త ఒప్పందం ఇప్పటి పరిస్థితులకు ఉపయోగపడేది రూపొందించాలని బ్రిటన్ ప్రధాని పావులు కదుపుతున్నారు. దానికి బైడెన్ సానుకూలంగా ఉన్నారు. ఇప్పటి ఒప్పందంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను రక్షించుకుంటూ, వాటి సిద్ధాంతాలు, విలువలను నిలబెట్టాలని సంకల్పిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా అమెరికా, ట్రంప్ కాలంలో ప్రదర్శించిన బహుళజాతి దోరణిని అమెరికా ఒదులుకుని యూరోపియన్ దేశాలకు అమెరికా ఒక నమ్మకమైన మిత్రుడు అనే భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.