Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మయన్మార్: మయన్మార్ సైనిక పాలకులు అంగ్‌సాన్ సూకీపై పదకొండు కిలోల బంగారంతో పాటు ఐదు లక్షల డాలర్లు లంచం తీసుకున్నట్టు ఆరోపణలు చేస్తూ కొత్త కేసు బనాయించారు. యాంగాన్ ప్రాంతీయ ముఖ్యమంత్రి నుంచి ఈ లంచం తీసుకున్నట్టు చెప్పుతున్నారు. అధికార దుర్వినియోగం చేసినట్టు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ఆ దేశంలో నిరసన వెల్లువ కొనసాగుతున్నాయి. మిలటరీ పాలకుల హింసలో ఇప్పటికే 850 మంది పౌరులు చనిపోయారు. సూకీ తాజా ఎన్నికలలో అవకతవకలకు పాల్పడ్డారనీ, చట్ట విరుద్ధంగా వాకీటాకీలు కల్గి ఉన్నారని తప్పుడులు కేసులు బనాయించారు. ఇప్పుడు అదనంగా ఈ కేసును జోడించారు. సూకీ తరఫున న్యాయవాది ఏ ఆరోపణలు చేసినా తాము కోర్టులో నిర్దోషులమని నిరూపించుకునేందుకు సిద్ధం అని ప్రకటించారు.