Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్: ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలలో ఫ్రాన్స్ ఇటు అమెరికా అటు చైనాలతో జత కట్టదని ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ స్పష్టం చేశారు. జీ-7 దేశాల సమావేశంకు ముందు ఆయన ఈ ప్రకటన చేశారు. ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో చైనా, సైనిక్ ఆధిపత్యం చెలాయించెందుకు పావులు కదుపుతున్నదని దాని కట్టడి చేయాలని అమెరికా ఆ ప్రాంతంలోని దేశాలను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో ఈ ప్రకటన రావడం చర్చనీయాంశం అయింది. జీ-7 దేశాల సమావేశానికి ఆహ్వానితులుగా భారత, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా పాల్గొంటున్నాయి.