Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోల్సోనారోపై బ్రెజిల్ సెనెట్ విచారణ
- హెచ్‌సీక్యూ కోసం ప్రయివేటు సంస్థల తరఫున మోడీతో లాబీయింగ్‌పై దర్యాప్తు
- భారత్ బయోటెక్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రెజిలియన్ కంపెనీపైనా..
- పార్లమెంటరీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలోకి మోడీ పేరు
బ్రెజిల్ : గతేడాది కరోనా మహమ్మారి విజృంభి స్తున్న వేళ హైడ్రాక్సీక్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ)కు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. దీని కోసం అమెరికా మొదలుకొని ప్రపంచ దేశాలన్నీ భారత్‌వైపు చూశాయి. ఈ జాబితాలో బ్రెజిల్ కూడా ఉన్నది. అయితే, హెచ్‌సీక్యూ కోసం జరిపిన లాబీయింగ్ ఆ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు తలనొప్పిగా మారింది. హెచ్‌సీక్యూ కోసం ప్రయివేటు కంపెనీల తరఫున భారత ప్రధాని మోడీతో ఆయన ఏవిధంగా లాబీయింగ్ జరిపారన్న దానిపై ఆ బ్రెజిల్ సెనెట్ విచారణ జరుపుతున్నది. ముఖ్యంగా రెండు పెద్ద బ్రెజిలియన్ సంస్థల తరఫున హెచ్‌సీక్యూ కోసం ముడి సరుకును ఇవ్వాల్సిందిగా బోల్సోనారో జరిపిన ప్రయత్నాలపై సెనెట్ దృష్టిసారించింది. అలాగే భారత్ బయోటెక్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రెజిల్ కంపెనీ ప్రెసిసా మెడికామెంటోస్‌కు చెందిన ఇద్దరు అధికారులను కూడా కమిషన్ పిలస్తుందని సమాచారం. ఈ విషయంలో ప్రభుత్వ పత్రాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సెనెట్.. ఇందులో భాగమైన ఉన్నతాధికారులను కూడా విచారిస్తున్నది. మరోపక్క, ప్రధాని మోడీ పేరు కూడా బ్రెజిల్ పార్లమెంటరీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ(సీపీఐ)లోకి రావడం గమనార్హం. హెచ్‌సీక్యూ వైద్య సమర్ధత నిరూపించబడలేకపోయినప్పటికీ బోల్సోనారో దానిని కోవిడ్-19 '' నివారణ ఔషధంగా'' అభివర్ణించడంపై అనేక మంది బ్రెజిల్ సెనెటర్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కాగా, గతేడాది ఏప్రిల్ 4న బోల్సోనారో, మోడీల మధ్య పూర్తి సంభాషణను కలిగి ఉన్న ఒక నివేదికలోని భాగాలను ఓ గ్లోబో వార్తాపత్రిక ప్రచురించింది.