Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీ-7 సదస్సులో ముస్లింల అంశాన్ని ముందుకుతెచ్చిన బైడెన్
కార్నివాల్ : చైనా పై దాడికి ఉయిఘర్ ముస్లింల అంశాన్ని అమెరికా మరోసారి ముందుకు తెచ్చింది. ఉయిఘర్, ఇతర మైనార్టీ జాతులకు చెందినవారితో వెట్టి చాకిరీ చేయిస్తోందని అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఆరోపించారు. ఈ విషయంలో చైనాపై ఒత్తిడి పెంచాలని బైడెన్ తన మిత్ర దేశాలను కోరారు. జీ-7 శిఖరాగ్ర సమావేశం రెండో రోజున బైడెన్ మాట్లాడుతూ, సమావేశం చివరిలో విడుదలజేసే సంయుక్త ప్రకటనలో ఈ అంశాన్ని తప్పనిసరిగా ప్రస్తావించాలని బైడెన్ కోరినట్టు తెలిసింది. దీనికి అన్ని యూరోపియన్ ప్రభుత్వాల మద్దతును ఆయన కోరారు.
మహమ్మారులను అడ్డుకుంటాం : గ్లోబల్ హెల్త్ డిక్లరేషన్ హామీ
జీ-7 దేశాలు శనివారం నాడు విడిగా ఒక ప్రకటన చేస్తూ భవిష్యత్తులో ఇటువంటి మహమ్మారులు తిరిగి తలెత్తకుండా చూస్తామని హామీ ఇచ్చాయి. ఈమేరకు గ్లోబల్ హెల్త్ డిక్లరేషన్‌పై జీ-7 నేతలు సంతకాలు చేశారు. వ్యాక్సిన్ లైసెన్స్ జారీ సమయాన్ని తగ్గించడం, భవిష్యత్తు అవసరాలకు సరిపడా వ్యాక్సిన్లు, చికిత్స, వ్యాధి నిర్ధారణ పరికరాలను సమకూర్చుకోవడం, అలాగే గ్లోబల్ నిఘా, వైరస్ జన్యు చిత్ర పటాన్ని రూపొందించడం వంటివి ఈ ఒప్పందంలో ఉన్నాయి. వ్యాక్సిన్ విధానం, కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం కోలుకుంటున్న తీరు, వాతావరణ మార్పులు గురించి చర్చించారు. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు ప్రతిగా ఇన్వెస్టిమెంట్ ప్లాన్‌ను జి-7 కూటమి ముందుకు తీసుకొచ్చింది.