Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త ప్రభుత్వ విశ్వాస పరీక్షపై పార్లమెంట్లో ఓటింగ్
టెల్ అవివ్: ఇజ్రాయిల్‌గా ప్రధానిగా బెంజిమెన్ నెతన్యాహూ 12 ఏళ్ల పాలనకు తెరపడనుంది. ఇందుకు ఆ దేశ పార్లమెంట్ వేదికైంది. నఫ్తాలి బెనెత్, లాపిడ్‌లకు చెందిన పార్టీలతో కూడిన కొత్త సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదనపై ఓటేసేందుకు స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు పార్లమెంట్ సమావేశమైంది. కడపటి వార్తలు అందే సమయానికి విశ్వాస పరీక్షపై ఓటింగ్ జరిగే ముందు నేతన్యాహూతో సహా పలు పార్టీల నేతలు ప్రసంగాలు ప్రారంభమయ్యాయి. దాదాపు నాలుగు గంటల పాటు విశ్వాస పరీక్షపై చర్చ తరువాత ఓటింగ్ జరుతుంది. సంకీర్ణ ప్రభుత్వానికి పలు ప్రతిపక్ష పార్టీల మద్దతు ఉంది. దీంతో పార్లమెంట్లో జరగనున్న విశ్వాస పరీక్షలో సంకీర్ణ కూటమి విజయం లాంచనంగా ఉంది. దీని తర్వాత కొత్త కేబినెట్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటు ద్వారా దేశంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన తొలగుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇజ్రాయిల్‌లో గత రెండేళ్లలో నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో భాగంగా చివరిగా ఈ ఏడాది మార్చి 23న జరిగిన పార్లమెంట్ ఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో 71 ఏళ్ల నేతన్యాహూ విఫలమయ్యారు. 120 స్థానాలు ఉన్న ఇజ్రాయిల్ పార్లమెంట్ ఎన్నికల్లో నేతన్యాహూకు చెందిన అధికార లీకుడు పార్టీ 30 స్థానాలు మాత్రమే విజయం సాధించింది. పార్లమెంట్లో దీంతో రెండో స్థానంలో పెద్ద పార్టీగా ఉన్న లాపిడ్ నేతృత్వంలోని యేష్ అటిడ్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు పూనుకుంది.