Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీ7 దేశాల ప్రణాళిక
లండన్ : చైనాకు చెందిన లక్ష కోట్ల డాలర్ల 'బెల్ట్ అండ్ రోడ్ ప్రాజె క్టుకు పోటీగా 'బిల్డ్ బ్యాక్ బెటర్ ఫర్ ది వరల్డ్ (బి3డబ్ల్యు)'ను జి7 దేశాలు ముందుకు తీసుకొచ్చాయి. ప్రధాన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనాను కట్టడి చేయడమే లక్ష్యంగా అమెరికా తీసుకొచ్చిన ఈ బీ3 డబ్ల్యూ ప్రాజెక్టుకు ఆదివారంతో ముగిసిన జీ-7 శిఖరాగ్ర సదస్సు ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాల కల్పనలో భాగస్వామ్యం అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని అమెరికాకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో ఇబ్బందులు పడుతున్న ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ ధనిక దేశాలు 40 లక్షల కోట్ల డాలర్ల దాకా పెట్టుబడులు పెట్టడమే బీ3 డబ్ల్యూ ఉద్దేశమని ఆయన చెప్పారు. ఇది చైనాను ఎదుర్కోవడానికి మాత్రమే కాదు, ఇప్పటి వరకు తమ విలువలు, ప్రమాణాలు, వ్యాపారం చేసే విధానాన్ని ప్రతిబింబించే ఒక్క సానుకూల ప్రత్యామ్నాయాన్ని కూడా ప్రపంచానికి చూపలేదన్న విమర్శను తొలగించుకునేందుకు కూడా ఇది అవసరమని అన్నారు. అయితే ఈ ప్రాజెక్టును ఎలా అమలు చేస్తారు? అన్నదాని గురించి ఇదమిత్థంగా ఏమీ చెప్పలేదు. సిల్క్ రోడ్ ప్రాజెక్టుగా పిలువబడే 'బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ)ను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఎనిమిదేళ్ల క్రితమే ప్రారంభించాడు. ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి, పెట్టుబడి కార్యకలాపాలు ఆసియా, యూరప్‌తో సహా వెలుపలి ప్రాంతాలకు విస్తరించాయి. అప్పటి నుంచి చైనా 167 దేశాలు, పలు ఆంతర్జాతీయ సంస్థలతో దాదాపు 200కు పైగా ఒప్పందాలు చేసుకున్నది. ఆసియా, యూరప్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా మధ్య కనెక్టివిటీతో పాటు సహకారాన్ని పెంపొందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్టు వలన ప్రపంచ వాణిజ్యం పెరుగుతుందని, వ్యాపార ఖర్యులు సగం మేర తగ్గుతాయని నిపుణులు పేర్కొన్నారు. అయితే కమ్యూనిస్టు చైనా ప్రపంచ నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్న భయం పశ్చిమ దేశాలను మరీ ముఖ్యంగా అమెరికాను వెంటాడుతోంది.
అమెరికా చైనా మధ్య వివాదం
చైనా, అమెరికా విదేశాంగ మంత్రుల మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఆ సంభాషణ సందర్భంగా చైనా, అమెరికాకు తన సొంత విషయాలలో తలదూర్చవద్దని హెచ్చరించింది. అమెరికా విదేశాంగ మంత్రి బిల్కిల్ చైనా పౌర హక్కుల విషయం, కోరాన వైరస్ పుట్టుక విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని కోరినప్పుడు చైనా వైరస్ పుట్టుక స్పందించి పరిశోధనలకు అనుమతులపై అమెరికా ఒత్తిడి చేయడాన్ని చైనా తీవ్రంగా పరిగణిస్తున్నది.