Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెరూసలేం: ఇజ్రాయిల్లో ఎనిమిది పార్టీల కూటమి ఒక ఓటు ఆధిక్యతనతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. దానితో నెతన్యాహూ 12 సంవత్సరాల పరిపాలన అంతం అవుతుంది. రెండు సంవత్సరాల కాలంలో స్పష్టమైన తీర్పు ఇవ్వలేని 4 ఎన్నికల ప్రక్రియకు కాలం చెల్లిపోతుంది. ఇజ్రాయిల్లో నేతన్యాహూపై అవినీతి ఆరోపణలపై విచారణ జరగనున్నది. గత నెలలో పాలస్తీనాపై పదకొండు రోజుల అనవసర యుద్ధం, కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో పక్షపాత ధోరణి లాంటి అంశాలతో ప్రతిపక్షాలు నేతన్యాహూపై పెద్ద ఎత్తున నిరసనలకు పాల్పడి ఏకంగా ఆయన ప్రభుత్వ స్థానంలో కొత్త కూటమి ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బెనెట్ కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్నారు. ఇజ్రాయిల్ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం కంటే ముందు ఆయన ప్రసంగాన్ని నేతన్యాహూ మద్దతుదారులు పెద్ద పెద్దగా కేకలు పెట్టి అడ్డుకున్నారు. దాని తరువాత నేతన్యాహూ మాట్లాడుతూ త్వరలోనే తాను మళ్ళి అధికారంలోకి వస్తానని ప్రకటించారు. పార్లమెంటు కార్యక్రమాలు సాగన్వికుండా నెతన్యాహూ మద్దతుదారులు అడుగడుగునా అడ్డుతగలడంతో వారిని బయటకు పంపివేశారు.