నీరు ప్రాణ కోటికి జీవనాధారం ప్రకృతి వనరుల్లో అతి ముఖ్యం పంచభూతాల్లో అత్యంత ప్రధానం జీవకోటి మనగడకు ఆధారం భూలోకంపై ప్రాణకోటి వృద్ధికి జీవన ఆధారం ఆహారంగా మానవాళికి ఒక అద్భుత వరం ఈ నీరే లేకుంటే మానవ మనుగడే ప్రశ్నార్థకం కానీ, మేము చేస్తున్న తప్పులే నిన్ను చేస్తున్నాయి మాకు దూరం -దూరం ఇక మేము చేపట్టాలి నీటి పొదుపుకు శ్రీకారం లేకుంటే భవిష్యత్ తరాలకు మిగులు అంధకారం నీటి పొదుపే భవితకు మార్గం ఆదమరిస్తే కలుగును శోకం కనుచూపు మేరలో పొంచి వుంది ప్రమాదం అవసరం మేర వాడుకుంటేనే పురోగమనం పాటించాలి ఇక నీటి పొదుపు సూత్రం ఇక నీటి నిల్వలకు కట్టాలి శ్రీకారం అడపాదడపా కట్టాలి ప్రాజెక్టు చెక్ డ్యాం వృధా నీటికి వేయాలి కళ్లెం! అనవసరంగా వాడుకుంటుంటే అవసరాలకు అక్కరకు రాకుండా పోవును ఇది నిజం.. ఇది గ్రహించాలి మనమందరం! భవిష్యత్ తరాలకు కల్గించొద్దు శోకం!!