Sun 14 May 01:06:35.623182 2023 పల్లవి :కనులలోని కాంతులను.. మనసులోని మమతలనుమురిపెములుగ కలబోసి.. తన సర్వము పెనవేసిసృష్టికి ప్రతి సృష్టి చేసెనే.. అమ్మ ఒడి స్వర్గముతలపింపచేసెనే.. ||కనుల||చరణం 1 :చిరు ప్రాయపు బోసినవ్వు.. చిరు మువ్వల సవ్వడులు..దోబూచుల దొంగాటలు .. చిలక పలుకు గారాలు..అడుగడుగున సంబరాలతో.. అమ్మ..మది నిండుగ పులకించెనేచరణం 2 :చందమామ కాంతులలో .. గోరుముద్దలు మురిపాలులాలిపాట మధురిమలు.. పవళింపు సేవలు..తప్పటడుగు బుజ్జాయితో .. అమ్మవేయి కనులు దివిటీలాయెనే ||అమ్మ|| ||కనుల||చరణం 3 :మారాలు.. గారాలు బుంగ మూతి చందాలుఆట పాట చదువులతో .. ఏటేటా బహుమతులుశ్రమ తానే మరచెనులే.. అమ్మ..మనసు తీర మురిసేనులే ||అమ్మ|| ||కనుల||చరణం 4 :తన ఇల్లే .. తన స్వర్గం.. తన పిల్లలే తన ప్రపంచంఆశయాలు కలలన్నీ ఊపిరిగా మలచుకొనిప్రాణమంత నిలిపేనులే ..అమ్మ మమతలెన్నో పంచేనులే ..అమ్మ ఋణమెపుడూ తీర్చలేనిదే ||అమ్మ|| ||కనుల||- విజయ భారతి, 9052445001 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి