Sun 04 Apr 00:49:41.661194 2021 కనుపాపను ఆవరించినచీకటి కాటుకజారిపోయే మెలకువను లెక్క చేయకస్వప్నాల వీధికి లాక్కెళ్తుంది చుక్కల తోపును తప్పుకుంటూ ఆకాశ దండానికి వేలాడుతూ తక్కెడ తనతో సరిదూగమంటూ పదాలకు సవాలు విసురుతోంది తూకానికి కూర్చున్న కాలంఅల్లిబిల్లిగా ఎగురుతూ గిరికీలు కొడుతూఒక్కటొక్కటిగా మెల్లి మెల్లిగాసంధి చేసుకుంటూ తరాజులోకి చేరుతున్నాయి పదాలు కాలం బరువుకు తేలిపోతున్న పదాలు దిగులుతో చిన్నబోయాయి అప్పుడే అటుగా వచ్చిన తోకచుక్కొకటి వాటిని పలకరిస్తూ రెక్కలల్లార్చి వెళ్ళిపోయింది పదాలకేదో తోచిందితరువాత..తారకల కాంతిని గ్రోలిన పదాలేతక్కెట్లో మిగిలాయిసరికొత్త వాక్యమేదో మిణుక్కుమందిఇప్పుడు కాలం కూడా వాక్యం పక్కనే - నస్రీన్ ఖాన్, 9652432981 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి