Sat 10 Apr 23:03:48.604619 2021 మాటల తేనెలు పూసిమెత్తగా కోసే ప్రయత్నంఉపమానాల వెన్నెలలు పరిచిశ్రమ దోపిడి చేసే వైనం...సూరీడికి హారతి పట్టికోడి కూయకముందేఇల్లూ వాకిలిని దిద్దే ఇల్లాలిబతుకంతా మౌన సాగరం గగన వనంలో వెలుగు కిరణమని భువన తలం పై సహన దీపమని మెల మెల్లగా కరిగించి కబళించే కళామయ నాటకంకలికి కనుల పుటలలో కదిలేనిశ్శబ్దాక్షర నిర్వేదాన్ని చదువుముదిత హదయ గగనంలోమౌనంగా ఎగసే వేదనా విహగాలను చూడు....శతాబ్దాల జీవన గమనంలోతరువై ఒదిగి హిమమై కరిగిప్రేమామతం పంచేతరుణి కథలోవిషాద వీణా తంత్రుల కన్నీటిస్వరమేమిటి?హిమ దీపంగా సుమ గీతంగాపరిమళాలు పంచేపడతి మనసులోవేల వేల మౌన శంఖాలువేకువ కే కళలను అద్దిరాతిరికే మెలకువలను నేర్పేనెలత కంఠాన గరళ తిమిరాలు- వెల్ముల జయపాల్ రెడ్డి, 9441168976 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి