అడపాదడపా.. తెలివితేటలు, అందరిలో నిన్ను, బకరాను చేయును. లక్కును నమ్ముకోకు, ఉన్నది అమ్ముకోకు. బుక్కును నమ్ముకో, జ్ఞానాన్ని పెంచుకో. గూగులే.. మొత్తం అనుకోకు, గురువు ఉండాలని గ్రహించు.
సెల్ ఫోనే ముఖ్యం అనుకోకు, అందులో చెప్పేది కూడా, నీ పుస్తకంలోని సెలబస్ నే అని గ్రహించు. ఈ 4జీ, 5జీ కాలానా.. గురుజీ..ని తక్కువ అంచన వేయకు. మొబైల్ లోనే.. వ-పుస్తకాలు ఉన్నాయని, నీ-పుస్తకాలను పాతసామానుకు వేయకు. ఛార్జింగ్ ఉన్నంత సేపే.. e-పుస్తకాలు. అది అయిపోతే.. ఇక నీ-పుస్తకాలే.. గతి అని మరువకు. ఈ సెలవుల్లో.. తలవంచి, నీ తరగతి పుస్తకాలన్నీ చదువు.. అర్ధం కానివి ఉపాధ్యాయులను అడుగు, అడిగేముందు.. వారి యోగక్షేమాలను తెలుసుకో.. అలా జ్ఞానానికి పునాది వేసుకొని, నీ జీవితాన్ని గెలువు. ఆల్ ది బెస్ట్..!!