నేను నా గదిలో ఒంటరిగా పిచ్చుక గూళ్ళు కడుతుంటాను పుల్లా పుడకలు నా అక్షరాలే అవి నా బాల్యంలో చిట్లినవేే యవ్వనారంభంలో నా చూపులన్నీ వాటి మీదే నాకళ్ల ముందు వెనకా సూర్యోదయాలే
నేనే సూర్యుడ్ని చంద్రుడ్ని నక్షత్రాన్ని నా ప్రతీకలన్నింటా ఏముందో నాకు మాత్రమే తెలుసు నేనో అల్పుణ్ణి ఐనా ఒంటరిని కాదు నన్ను దిగంతాల ఆవలున్నావని కీర్తిస్తారు ఫ్లడ్లైట్ల వెలుగుని నాలోకి ప్రసరిస్తారు
ఇందులో ఎవరి అస్తిత్వం వారిది జీవితం బహు చిన్నది ప్రశంసల నీడలో నాలుగు రోజులు సేదదీరాలి జ్ఞానులున్న ప్రపంచం మనది నాలాంటి వారు మరణిస్తున్నా మళ్ళీ మళ్ళీ బతికిస్తుంటారు. గొంగళి పురుగులకే కాదు హైబర్ నేషన్ సృష్టి అందరి మీద భ్రమల మత్తుని చల్లేసింది భౌతికంగా ఈ లోకం మారిందా ఏమోలే ఇక్కడ భావాలకే చావు లేనిది నేను వ్యక్తి నుండి సమూహానికి ఎగబాకి విఫలమైన ప్రతి సారీ కొత్త స్వప్కాటిలిఖిస్తాను నాలో నేను గూళ్లు కట్టుకుంటాను అక్షరాలను పదాలను నా మీద చల్లుకుని మరణశాసనాన్ని రాసుకుంటాను నేను బతికినా చచ్చినా వివాదాన్నే విశ్లేషణనే - పి.చంద్రశేఖర్ అజాద్, 9246573575