నిన్నటి వరకు ఆమె నాకు బడిలో పాఠాలు బోధించిన పంతులమ్మ ఈరోజు ఆమె అనుకోని విధంగా ఫోటోలో శ్రద్ధాంజలి ఘటింపబడుతు నాతో కన్నీళ్లు పెట్టిస్తోంది!
ఇంతకు ముందే అతను నాకు ఆసుపత్రిలో డాక్టర్‌గా మారి ఇంజక్షన్ ఇచ్చాడు నేను మెట్లు దిగేలోపే శవంగా మారి నా కన్న ముందే ఎక్కడికో బయలుదేరాడు!
నేను ఇంట్లో ఎప్పటిలాగే టీ తాగుతూ బాల్కానిలో నిలుచున్నా నా కళ్ళ ముందు నుండి వెళ్ళిన ఆమె తిరిగి చూసేలోపే చనిపోయిందన్న వార్త నా నెత్తి మీద పిడుగులా పడింది!
రాత్రి కలలోకి వచ్చిన నా ప్రాణ స్నేహితులని పలకరించాలనుకున్నా ఫోన్ కలిపే లోపే అవతలి నుండి ఏదో తెలియని స్వరం అపశతి పలుకుతూ ఆమె లేదు ఇందాకే వెళ్ళిపోయింది అంటు ఏడుపు వినబడుతుంది!
ఎవరు తోడు లేక దిక్కుతోచని స్థితిలో పరధ్యానం నడిరోడ్డు మీద నడుస్తున్న
ఏ దిక్కులేని ఆమె తన భర్త ప్రాణాలను దక్కించుకునేందుకు మత్యువుతో పోరాడుతూ నోటిలో నోరు పెట్టి శ్వాస ఊదుతుంది!
ఇంతకీ నేనిప్పుడు ఏం చేయను? నాకు ఆక్సిజన్ లాంటి నా వాళ్ళందరూ పొయ్యేసరికి ఊపిరి ఆడటం లేదు!
అందుకే వాళ్ళందరూ వెళ్లి పోయ్యాక ఒంటరిగా ఉండలేక ఇలా జీవచ్ఛంలా మిగిలిపోయాను!!