Sat 29 May 21:20:28.913354 2021 వేగంగా వచ్చి గాలి నిదురోతున్న కళ్ళను తట్టిలేపింది వెన్నెల కురుస్తున్న రేయి కిటికీలోంచి అద్భుత చిత్రంలా కనిపిస్తోంది ఆకాశం !వెన్నెల గాఢతను మోయలేక చందమామనుబావిలోకి విసిరేసింది నింగిలో ... నీటి బావిలో... పున్నమి చంద్రుడిద్విపాత్రాభినయం పంట కాపరి గొంతులోంచి వెన్నెల పాటను వినిపించడానికి గాలి వారధి కడుతోంది ఒడ్డున సేదతీరిన నావ!జాబిలమ్మ జాణతనం తిలకిస్తూ... జాగరణ చేస్తోంది పున్నమి రేయిని గుర్తెట్టుకుని వీధి దీపం విశ్రాంతి తీసుకుంటుంది చెరువులో కలువ... వెన్నెలతో కబుర్లు ... చెవులు మూసుకున్నాయిచేపలు నిటారు చెట్టు... నిలువెత్తు గట్టు...వెన్నెల వెలుగులోవేకువ దాకా... మాట్లాడుకున్నాయిచందమామ కథలు వింటూ... అమ్మ ఒడిలో ఒదిగిన చంటి పిల్లాడ్ని అసూయగా చూస్తూ... ఆకాశంలో... రేయంతామేల్కొన్నాడు పున్నమి చంద్రుడు.- ఎ.నాగాంజనేయులు, 9959017179 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి