Sat 05 Jun 20:53:30.899373 2021
Authorization
నా కళ్ళు సరిగ్గా విప్పారక ముందు నుండే చూస్తున్న,
ఎన్నో అద్భుత ప్రేమమూర్తులను పరిచయం చేసినరు
నా గొంతు మాటలు పలకనప్పటి నుండి చూస్తున్న, ఎంతోమంది సంస్కర్తలను చూపినరు
మరి ఇప్పుడు ఈ వీధులకు ఏమైంది..!?
నా చేతులు బలంగా పట్టలేని
లేత వయసు నుండి చూస్తున్న,
పొట్ట నింపుట కోసం పొద్దు నుండి పొద్దు దాక రెక్కలు
ఊపుతున్న ఎందరో శ్రమజీవుల నువ్వులు బంధించినరు
నా కాళ్ళపై సొంతంగా,
ఆధారం లేనిదే నడవని రోజుల నుండి చూస్తున్న,
కష్టాలు నెదిరించి, పరిస్థితులను ఎదిరించి
వడివడిగా పడుతున్న పోరాట నేతల అడుగులు,
ఎన్నో చారిత్రక నేపథ్యాలు మోసిన..
ఈ వీధులకేమయ్యింది..!?
అర్థమయ్యీ కానీ స్థితి నుండి
వినబడీ వినబడని విషయాలు వింటున్నా
వ్వుల హౌరులు, ఆనంద లీలలు ప్రవహింప చేసిన
ఈ వీధులకు ఏమయ్యింది..!?
ఏ వీధిలో చూసినా
అటు ఇటు పరుగులు తీసే ఆర్తనాదాల అంబులెన్సులు,
ఏ వీధిని కదిలించినా
కొట్టుమిట్టాడుతున్న ఆఖరి ఆయువులు,
ఏ వీధిని కదిలి చూసినా
ఆగమాగం ఉరికే అడుగుల శబ్దాలే,
ఏ వీధిని పలకరించినా నిషేధాజ్ఞలు, కన్నీటి ముఖాలే..
నిశ్శబ్ద కంటకి కరాళ నత్యాన్ని అధిగమిస్తూ,
జనాల ఆయువు లేకుండా పిండేసే
కరోనా జిత్తులమారిని కడతేర్చి...
మునుపటి వీధులు కావాలి
అప్పటి ఆశలు ఆశయాలు కనబడాలి,
ఈ వీధులు..
విశాల ప్రపంచ విజయగాథలు నిర్మించే వేదికలు కావాలి,
విశ్వాన్ని తాకి అనంత విశ్వాస మార్గాలకు
సన్నాహక సమయమవ్వాలి,
వీధులు రేపటి కొత్త తరాల అద్భుత
తలరాతలు లిఖించే విధి కావాలి.
- రవికుమార్ కంచి, 9494345594