నీవు ఇల్లును ఊడ్చే ఈత పొరకట్టవై కోళ్లను మూసే కోళ్ల గంపవై ధాన్యాన్ని దాచే ధాన్యపు గుమ్మివై పిల్లల బారసాలలో ఊగే తొట్టెలవై మహిళల మరుగుకు జాలెట తడకవై పోశమ్మ పండుగకు మొలకల బుట్టివై మొక్కల పెరుగుదలకు రక్షణ గుమ్మివై గ్రామీణ జీవనంలో ఓ వెలుగు వెలిగిన నీ నైపుణ్యం అమోఘం, అద్భుతం!
ఇంత సజనాత్మకత, నైపుణ్యం ఉన్నా ఈ బ్రాహ్మణీయ మనువాద సమాజంలో నీవు అల్పుడవే, అధముడవే.
''మానవ నాగరికతను మలుపు తిప్పిన వ్యవసాయం దానికి ఊతమిచ్చిన ఎరుకల తెగ వత్తి సాయం''