Sun 11 Jul 05:57:35.186716 2021 పల్లవి : పచ్చనోట్లు మేసేటి దున్న పోతోరు నీ పళ్ళు రాలి పోతాయి ఉన్న చోటే (2) పళ్ళు రాలితేముంది అయ్య బాబోరు పెట్టుడుపళ్ళు కట్టించుకుంట చూడు బాబారు(2)చరణం : టేబుల్ మీద ఫైళ్ళెన్నో పేరుకున్నవీ తమ బాధలు తీర్చమని అరుస్తున్నవీ టేబుల్ మీద ఫైళ్ళెన్నో పేరుకున్నవీ తమ బాధలు తీర్చమని అరుస్తున్నవీ అర్జీలన్నీ చూడటం మనవల్లకానిది లంచమెవడు ఇస్తడో ఆ ఫైలుకదుల్తది అర్జీలన్నీ చూడటం మనవల్లకానిది లంచమెవడు ఇస్తడో ఆ ఫైలుకదుల్తది (పచ్చనోట్లు)చరణం : లోకమంత నీ తీరు చూస్తున్నది లంచగొండి నువ్వనీ అంటున్నది కడుపు కాలిందంటే నీపైనపడ్తది బొమికలల్లో సున్నాన్ని రాలగొడ్తది బల్లకింద చేయి నాకలవాటైనది లంచం పుచ్చుకోలేదంటే దురదపెడ్తది దున్నపోతు మీద వర్షం ఏ పాటిది మంచి చెప్పబోతే నీ పెడచెవిన పెడ్తివి (పచ్చనోట్లు)చరణం : పేదలకే బతుకు భారమౌతుంటది లంచాలు వెండికంచాలు వాళ్ళకేడివి సర్కారీ నౌకరేమో నీకున్నది సాయం చేసే గుణముంటే మంచిగుంటది గడ్డి మేసే గుణమెమో నాకున్నది నా అడుగుఅడుగులో కూడా అడుసున్నది రొంపిలోన ఈ బతుకే హాయిగున్నది ఏ గంగకూడా దీనిని కడగకున్నది (పచ్చనోట్లు)''దసరాబుల్లోడు'' చిత్రంలోని''పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్ల'' పాటకు పేరడి. రచన: ''ఆచార్య ఆత్రేయ'' - డా. బి. బాలకష్ణ, సెల్: 9948997983 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి